Breaking News

మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్‌ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?

Published on Wed, 06/11/2025 - 13:24

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్‌ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్‌ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.

ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్‌ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. 

కిషన్‌ రెడ్డినే ప్రధాన అడ్డంకి
తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారార‌ని  సీఎం రేవంత్ విమ‌ర్శించారు. 'కిషన్‌రెడ్డి, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉ‍న్నంత వరకూ కాంగ్రెస్‌ పార్టీలోకి కేసీఆర్‌ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్‌ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్‌లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. ​కేటీఆర్‌ చెప్పినట్టే కిషన్‌రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 

నేను ఉన్నంత వరకు కవితకు నో ఎంట్రీ..!

11 శాఖల్లో ఏది.. ఎవరికి?
మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌ క్లారిటీ ఇ‍వ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్‌, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)