Breaking News

విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక విభాగం

Published on Sun, 09/28/2025 - 04:22

విజయనగర్‌ కాలనీ(హైదరాబాద్‌): రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతోపాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యువతీయువకులు తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల అవకాశాలు కల్పింస్తుందని, ఆ అవకాశాలను సది్వనియోగం చేసుకొని భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ‘ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా రూ.2,000 స్టైపెండ్‌ ఇస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని, ఇది ఖర్చు కాదు. భవిష్యత్‌కు పెట్టుబడి. పని చేయాలన్న సంకల్పం కావాలి. కష్టపడి పనిచేయాలని’చెప్పారు.  

తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలి 
ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతమున్న 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తే, టాటా సంస్థ రూ.2,100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏటీసీలను తీర్చిదిద్దిందని చెప్పారు.  

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు 
రాష్ట్రంలో ఏటా లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ పట్టా పొందుతున్నా, నైపుణ్యం లేని కారణంగా చాలామందికి ఉద్యోగావకాశాలు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం లేనిదే ప్రైవేట్‌లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని, అందుకే స్కిల్స్‌ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్నదే మా సంకల్పమన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్, డాక్టర్‌ మల్లు రవి, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.  
 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)