హార్వర్డ్‌ వర్సిటీలో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి, సీఎం రేవంత్‌ ఏమన్నారంటే..

Published on Fri, 01/30/2026 - 13:57

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్‌ సాధించారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్న విషయాన్ని తన ఎక్స్‌ ఖాతాలో స్వయంగా తెలియజేశారాయన. 

ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌లో షేర్‌ చేసుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు.. టీచర్స్‌, తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చున్నట్లు తెలిపారు.

హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇక్కడి ప్రతికూల వాతావరణంలోనే నా ఈ కోర్సు పూర్తైంది. ఆ సమయంలో అధ్యాపకులు, తోటి విద్యార్థుల రూపంలో అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నాను. వాళ్ల నుంచి ఎంతో విలువైన పాఠాలు నేర్చుకున్నాను అని ట్వీట్‌ చేశారాయన.

Videos

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

నేనూ సీఎం అవుతా టైం వస్తే అన్నీ అవే వస్తాయి

ఇదేం అభిమానం... పవన్...?

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)