Breaking News

సంక్షేమ వసతి గృహాల్లోనూ ఎఫ్‌ఆర్‌ఎస్‌

Published on Tue, 10/14/2025 - 05:31

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరు కూ డా ఇదే విధానంలో స్వీకరించాలన్నారు. ఈమేరకు హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలన్నారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఆహారంతో విద్యార్థులకు లభించే కేలరీలను తెలుసుకోవాలని చెప్పారు.  

హాస్టళ్ల సమాచారం డాష్‌బోర్డులో... 
హాస్టల్‌ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్‌ అధికారులు చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలన్నారు. ‘హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్‌ చేయాలి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను సంక్షేమ హాస్టళ్లతో అనుసంధానించాలి.

హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. 24 గంటలూ ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్‌ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించాలి’అని రేవంత్‌ పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్‌íÙప్‌లు, సిబ్బంది జీతాలు, డైట్‌ చార్జీలు, నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపునకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను సీఎం ఆదేశించారు.  

మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయండి 
హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిధుల విడుదల కోసం ప్రతి నెలా గ్రీన్‌ చానల్‌ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు అందించే సేవలను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయాలని, అవసరమైన యాప్‌లను రూపొందించాలని నిర్దేశించారు.

ముఖ్యమంత్రి సహాయనిధి కింద సంక్షేమ విద్యాసంస్థలకు రూ.60 కోట్లు ప్రత్యేకంగా కేటాయించగా... ఇందుకు సంబంధించిన చెక్కులను ఆయా శాఖల సీనియర్‌ అధికారులకు అందించారు. ఈ నిధులను హాస్టళ్లలో మరమ్మతులు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, డైట్‌ చార్జీలు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)