Breaking News

లైఫ్‌ సైన్సెస్‌లో సహకారం

Published on Wed, 02/18/2026 - 05:48

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలనుకునే గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు తమ జీసీసీ (గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఫ్యూచర్‌ సిటీలో జీసీసీల కోసం ఒక ప్రత్యేక జోన్‌ ఏర్పాటునకు రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు.

మంగళవారం హైటెక్స్‌లో 23వ బయో ఆసియా సదస్సు–2026 ప్రారంభమైన సందర్భంగా... లైఫ్‌ సైన్సెస్‌లో గ్లోబల్‌ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్‌లతో రేవంత్‌ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు తెలంగాణలో తాము పెట్టదలచుకున్న పెట్టుబడులను ప్రకటిస్తూ ఒప్పందాలు చేసుకున్నాయి.

ఇవీ ఒప్పందాలు 
⇒ ఫ్రాన్స్‌లో తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుంచి విడిపోయిన గ్లోబల్‌ కన్సూ్యమర్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ అయిన ఒపెల్లా హెల్త్‌కేర్, తన జీసీసీ కార్యకలాపాలను 42,000 చ.అ సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పించనుంది. 

⇒ జీఏపీఎఫ్‌ఏ ఇండోనేషియా విభాగమైన... వాక్సిండో యానిమల్‌ హెల్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక బీఎస్‌ఎల్‌3 వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, ఆక్వాకల్చర్‌ కోసం వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది. 

⇒ ఏఐ, డేటా సైన్స్‌ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్‌ ఐఎన్సీ.. ఏఐ ఆధారిత హెల్త్‌ కేర్, లైఫ్‌ సైన్సెస్‌పై కీలక సేవలు అందించిన సంస్థ, తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించనుంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్‌ కేర్‌ రంగంలో మరింత ఆధునికత రానుంది. 

⇒భారత లైఫ్‌ సైన్సెస్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్‌ లైఫ్‌ సైన్సెస్‌ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ 12 ఎకరాల స్థలంలో 1 మిలియన్‌ చదరపు అడుగుల అడ్వాన్డ్స్‌ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)