Breaking News

నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

Published on Tue, 04/15/2025 - 15:30

హైదరాబాద్:  నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది.   ఆయన ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడి కాస్త కిందకు కుంగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది.  లిఫ్ట్ మొరాయించడమే కాకుండా ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంత లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్‌ సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. కాసేపు అంతా అయోమయానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.  ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం రేవంత్ ను పంపారు. ఈరోజు(మంగళవారం) నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో భాగంగా రేవంత్ అక్కడకు హాజరైన క్రమంలో ఈ  ఘటన చోటు చేసుకుంది. 

పార్టీలోని నేతలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌.. పార్టీలో నిరసన గళం వినిపిస్తున్న నేతలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ లైన్‌ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ పేర్లు ప్రస్తావించకుండా రేవంత్‌  ఆయా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్‌ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.

గతద్ది రోజులుగా పార్టీలో పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే వార్‌ నడుస్తోంది. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ప్రేమ్‌ సాగర్‌ రావులు పార్టీ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తమకు పదవులు రావేమోననే భయం కూడా వారిలో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అధిష్టానానిని తమదైన శైలిలో హెచ్చరికలు పంపుతున్నారు. దీనిపై రేవంత్‌ తీవ్రంగా స్పందించారు. మీ మాటల  వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్‌ అంటూ తేల్చిచెప్పారు. 

ఇదీ చదవండి: 

అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)