Breaking News

‘కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోండి’

Published on Wed, 05/07/2025 - 20:10

హైదరాబాద్: ఆపరేష్ సిందూర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం.

‘అన్ని శాఖలు పూర్తి గా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. రక్షణ రంగానికి చెందిన సంస్థల  దగ్గర భద్రతా పరమైన చర్యలు చేపట్టాలి. 

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద  భద్రతను కట్టుదిట్టం చేయాలి. హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత కల్పించాలి. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా బృందాలతో   రాష్ట్ర నిఘా  బృందాలు సమన్వయం చేసుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి’ అని సూచించారు.

సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ
భారత సైన్యానికి సంఘీభావంగా రేపు(గురువారం) సాయంత్రం ఆరు గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిపైన సైతం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు చర్చించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం, డిప్యూటీ సీఎంలు. భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని యువతకు విజ్ఞప్తి చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)