కాంగ్రెస్‌ వాళ్ల ఆపద మొక్కులను నమ్మొద్దు: సీఎం కేసీఆర్‌

Published on Sun, 08/20/2023 - 15:27

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట.. జిల్లా కావడం ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కళాశాల, వెజ్, నాన్‌ వెజ్‌ మార్కెట్, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనాలను ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తలసారి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌.. అభివృద్ధిలో ఇప్పటికే అత్యుత్తమ దశకు చేరుకున్నామన్నారు.

‘‘తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ ముందుంది. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభారతి నిర్మిస్తాం. జిల్లాలోని ప్రతి మున్సిపాల్టికి రూ.50 కోట్లు మంజూరు చేస్తాం. ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌ కూడా నిర్మిస్తాం. సూర్యాపేటపేట జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు మంజూరు చేస్తాం. కాంగ్రెస్‌, బీజేపీలకు 50 ఏళ్లు అవకాశం ఇచ్చారు.. ఈ 50 ఏళ్లలో ఆ పార్టీలు ఏం అభివృద్ధి చేశాయి. రైతుల గురించి కాంగ్రెస్‌ ఎప్పుడైనా ఆలోచించిందా?’’ అని సీఎం ప్రశ్నించారు.

పెన్షన్‌ తప్పకుండా పెంచుతాం.. తర్వలోనే ప్రకటిస్తాం. ఇచ్చిన ఏ మాటా తప్పలేదు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పుష్కలంగా సాగునీళ్లు ఉన్నాయి. రైతులకు 3 గంటలే కరెంటు చాలని కాంగ్రెస్‌ అంటోంది. కర్ణాటకలో కరెంటు కష్టాలు ఇప్పటికే మొదలయ్యాయి. ధరణి వ్యవస్థ తెచ్చాం.. వీఆర్‌వోలను తొలగించాం. వీఆర్‌వో వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భూముల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు తొలగిపోయాయి. ధరణితో రిజిస్ట్రేషన్‌ కష్టాలు తీరిపోయాయి’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘ధరణి వ్యవస్థను తీసేస్తామని కాంగ్రెస్‌ అంటోంది. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా అధికారం లేదు. పైరవీకారులకు మళ్లీ అధికారం రాకూడదు. కాంగ్రెస్‌ వాళ్ల ఆపద మొక్కులను ప్రజలు నమ్మొద్దు. మోసపోతే ఘోష పడతాం. ఎవరు ఎన్ని కథలు చెప్పిన విజయం బీఆర్‌ఎస్‌దే’’ అని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)