Breaking News

యూసీసీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..

Published on Mon, 07/10/2023 - 20:48

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంద. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇక, తాజాగా ఉమ్మడి పౌరస్మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ కేంద్రంపై సంచలన కామెంట్స్‌ చేశారు. 

అయితే, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై సోమవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్‌, బోర్డు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతున్నది.

దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బీజేపీ ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. 

యూసీసీతో అందరికీ ఇబ్బందులే: ఒవైసీ
మరోవైపు.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్‌ తెస్తామన్న యూసీసీని వ్యతిరేకించాలని కేసీఆర్‌ను కోరాం. సీఏఏను వ్యతిరేకిస్తూ టీఎస్‌ అసెంబ్లీలో మొదటగా తీర్మానం చేసింది. యూసీసీ తీసుకురావడం ద్వారా దేశంలోని భిన్నత్వాన్ని దెబ్బతీయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. యూసీసీ కేవలం ముస్లింలకే కాదు.. హిందువులతో పాటుగా క్రిస్టియన్లు, వివిధ ఆదివాసీ వర్గాలకు ఇబ్బంది. దేశంలో భిన్నత్వం ఉండటం మోదీకి ఇష్టం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

ఇది కూడా చదవండి: కేటీఆర్‌ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)