Breaking News

నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్లు.. ‘ఒలింపిక్స్‌’ శిక్షణ కోసం సీఎం కేసీఆర్‌ సాయం

Published on Fri, 05/19/2023 - 08:23

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ రాబోయే ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించి తెలంగాణతోపాటు భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. నిఖత్‌ జరీన్‌కు రాబోయే ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో నిఖత్‌ జరీన్, సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రూ.2 కోట్లను ప్రకటించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్‌ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిఖత్‌ జరీన్‌ను సందీప్‌ కుమార్‌ సుల్తానియా  సచివాలయంలోని తన చాంబర్‌లో నిఖత్‌కు శాలువా కప్పి సత్కరించారు.

చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)