Breaking News

సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం 

Published on Thu, 11/02/2023 - 04:05

మర్కూక్‌ (గజ్వేల్‌):  బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో బుధవారం రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉదయం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్వంలో యాగానికి అంకురార్పణ చేయగా.. సీఎం కేసీఆర్‌ దంపతులు యాగ సంకల్పం చెప్పి పండితులకు దీక్షా వ్రస్తాలను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్రస్వామి మాట్లాడుతూ.. రుద్ర, చండీ, నవదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని రాజశ్యామల యాగం విశిష్టమైనదని తెలిపారు. రాజులతోపాటు సామాన్యులను అనుగ్రహించే మహాశక్తివంతమైన రాజశ్యామల యాగం కఠినమైన బీజాక్షరాలతో కూడినదని.. సీఎం కేసీఆర్‌ కుటుంబానికే కాకుండా యావత్‌ రాష్ట్రానికి ఇది ఆశీర్వాదం వంటిదని వివరించారు. 

శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసి.. 
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటూ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన ఈ యాగానికి రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా నామకరణం చేసినట్టు రుత్విక్కులు తెలిపారు. ఫామ్‌హౌస్‌లో శాస్త్రోక్తం గా ప్రారంభమైన యాగం రెండు రోజుల పాటు జరగనుంది. తొలి రోజున ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతిపూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రసనతో అంకురార్పణ చేశారు.

అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్‌ దంపతులు సాష్టాంగ నమస్కారం చేసి.. గురు ఆజ్ఞ తీసుకొని యాగాన్ని ప్రారంభించారు. రుత్విక్కులు కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చెప్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నవదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రా ర్థిస్తూ అస్త్రరాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. అఖండ స్థాపన అనంతరం యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు.

#

Tags : 1

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)