Breaking News

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి 

Published on Mon, 08/07/2023 - 03:38

సాక్షి, హైదరాబాద్ః దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా అసెంబ్లీహాల్‌లోని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పిం చారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్‌ దాస్యం వినయ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు, పలువురు ఎమ్మెల్యేలు జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పిం చారు.

శాసన మండలి ప్రాంగణంలో జయశంకర్‌ చిత్రపటానికి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్‌ అలీ, చీఫ్‌విప్‌ భానుప్రసాదరావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు నివాళులర్పిం చినవారిలో ఉన్నారు. జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి కేటీ రామారావు అన్నారు.

జయశంకర్‌ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి కేటీఆర్‌ పార్టీ నేతలతో కలిసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్‌ పాత్రను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.  

మంత్రుల నివాస సముదాయంలో 
జయశంకర్‌ జయంతి సందర్భంగా మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)