Breaking News

కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్తులు

Published on Thu, 12/07/2023 - 00:35

సిద్దిపేట రూరల్‌/మర్కూక్‌ (గజ్వేల్‌): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కలిశారు. బుధవారం తొమ్మిది బస్సుల్లో సుమారు 540 మంది గ్రామస్తులు సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు కలుస్తున్నందున వారిని లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో సుమారు రెండు గంటలపాటు నిరీక్షించారు.

అనంతరం లోపలికి అనుమతించారు. దీంతో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. అయితే...ఆయన మాట్లాడకుండానే అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు ఉన్నారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)