Breaking News

భారీగా పెరిగిన చికెన్ ధరలు

Published on Sun, 07/12/2026 - 08:11

చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. రోజూ కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెప్తుండగా కోడిగుడ్డు ధర చూస్తే వాటిని కూడా కొనుక్కుని తినలేని పరిస్థితులున్నాయని ప్రజలు వాపోతున్నారు. జూన్‌లో కిలో కోడి మాంసంను రూ.270 నుంచి రూ.280కు రిటైల్‌ మార్కెట్‌లో అమ్మారు. జూలై 1వ తారీఖు నుంచి ఆ ధర రూ.300కు చేరి గత వారం రోజుల నుంచి రూ.320కు పెరిగింది. కాగా మార్కెట్‌లో రూ.320 ఉన్నా కొందరు రిటైల్‌ వ్యాపారులు తమ లాభాలు తగ్గించుకుని రూ.300కే కిలో చికెన్‌ అమ్ముతున్నారు.  

గుడ్ల ధరలూ అంతే 
ఇటీవల కోడిగుడ్ల ధరలు సైతం బాగా పెరిగిపోయాయి. జూన్‌లో రిటైల్‌ దుకాణాల్లో గుడ్డు ధర రూ.7 ఉండగా ప్రస్తుతం రూ.7.50 నుంచి నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. చికెన్, గుడ్ల ధరలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి తటపటాయిస్తున్నారు. కొన్ని రోజులుగా ధరలు పెరగడంపై రిటైల్‌ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు అడ్డగోలుగా పెరగడంతో చికెన్‌ అమ్మకాలు తగ్గి తమ లాభాలు తగ్గాయని రిటైల్‌ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు, లాభాలు తగ్గడంతో దుకాణాల నిర్వహణ కష్టంగా మారిందని పలువురు రిటైల్‌ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధరలు అదుపు చేయాలి 
చికెన్, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ అధికారులు స్పందించి వాటి ధరలు అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జూలై ఆరంభం నుంచి వాటి ధరలు అడ్డగోలుగా పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. కాగా కోళ్ల పెంపకం చేపట్టే కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి చికెన్, గుడ్ల ధరలు ఇష్టానుసారంగా పెంచారని రిటైల్‌ చికెన్‌ వ్యాపారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ధరలు అదుపు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)