Breaking News

చేవెళ్ల దుర్ఘ‌ట‌న‌.. కార‌ణాలు ఇవే!

Published on Mon, 11/03/2025 - 14:36

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బ‌స్సు ప్రమాద‌ దుర్ఘ‌ట‌న‌కు (Chevella Bus Accident) టిప్పర్ ఓవ‌ర్ లోడ్‌, ఓవ‌ర్ స్పీడ్ కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా అధికారులు గుర్తించారు. ప‌రిమితికి మించి కంక‌ర నింపుకుని, మితిమీరిన వేగంతో వెళుతూ బ‌స్సును టిప్ప‌ర్ ఢీకొట్ట‌డంతో భారీ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 19 మంది చ‌నిపోగా, 32 మంది వ‌ర‌కు గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు రోడ్డుపైన ఉన్న భారీ గుంత (గొయ్యి) కూడా ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. గుంత‌ను త‌ప్పించ‌బోయి టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌ బ‌స్సును ఢీకొట్టాడ‌ని అంటున్నారు. ఢీకొట్టిన వెంట‌నే టిప్ప‌ర్.. బ‌స్సుపైకి ఒరిగిపోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. టిప్ప‌ర్‌లోని కంక‌ర.. ఒక్క‌సారిగా బ‌స్సులోని ప్ర‌యాణికుల‌పై ప‌డ‌డంతో వారిలో చాలా మంది ఊపిరి ఆడ‌క ప్రాణాలు కోల్పోయారు. టిప్ప‌ర్‌లో 35 ట‌న్నుల కంక‌ర ఉండాల్సి ఉండ‌గా 60 ట‌న్నుల కంక‌ర ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

బ‌స్సు డ్రైవ‌ర్ వైపు సీట్లు అన్ని నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ఈ వ‌రుస‌లోని వారంద‌రూ దాదాపు ప్రాణాలు కోల్పోయారు. చ‌నిపోయిన వారిలో  ఇద్ద‌రు డ్రైవ‌ర్లు స‌హా ఆరుగురు పురుషులు ఉన్నారు. 

చ‌ద‌వండి: అలా ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను

ప్ర‌మాదానికి కార‌ణాలు
1. టిప్ప‌ర్ ఓవ‌ర్ లోడ్‌, ఓవ‌ర్ స్పీడ్‌
2. రోడ్డుపైన భారీ గుంత‌
3. టిప్ప‌ర్‌లో ప‌రిమితికి మించిన‌ కంక‌ర‌
4. గొయ్యి రావ‌డంతో త‌ప్పిన టిప్ప‌ర్‌ కంట్రోల్‌
5. టిప్ప‌ర్‌లోని కంక‌రపై టార్పాలిన్ లేక‌పోవ‌డం
6. టిప్ప‌ర్‌లోన కంక‌ర మొత్తం బ‌స్సుపై ప‌డ‌డం
7. బ‌స్సులో సీట్ల‌కు మించి ప్ర‌యాణికులు

Chevella: చెవి నొప్పి అని తీసుకొచ్చా మా నాన్న చనిపోయాడు

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు