Breaking News

భార్యాభర్తల చీటింగ్‌

Published on Sun, 07/28/2024 - 07:36

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ ఇప్పిస్తామని మోసం చేసిన భార్యభర్తలను సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్‌కు చెందిన పాలడుగు రఘురాం, పాలడుగు సునీత భార్యభర్తలు. వీరికి సైబరాబాద్‌కు చెందిన చాట్ల సంజీవ్‌ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. 

ఈ క్రమంలో సంజీవ్‌ కుమారుడికి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ సీటు ఇప్పిస్తామని పాలడుగు దంపతులు సంజీవ్‌ను నమ్మించారు. అమెరికాలోని వైట్‌ హౌస్‌లో పనిచేసే సుమంత్‌ అనే వ్యక్తి తమకు బాగా పరిచయమని, ఇతను అడ్మిషన్‌ ఇప్పిండంలో మనకు సహాయం చేస్తాడని మాయమాటలు చెప్పారు. అడ్మిషన్‌కు కొంత ఖర్చు అవుతుందని చెప్పి, రూ.3.25 కోట్లను వసూలు చేశారు. 

అడ్మిషన్‌ కోసం అమెరికా వెళ్లి సుమంత్‌ను కలిసి వస్తామని చెప్పి డబ్బు తీసుకొని భార్యభర్తలిద్దరూ కలిసి అమెరికాకు కాకుండా మైసూర్‌కు చెక్కేశారు. కొత్త సిమ్‌ కార్డును తీసుకొని యూఎస్‌లో ఉన్నామని బాధితుడిని నమ్మించి వాట్సాప్‌ చాట్‌లో మాత్రమే సంభాంచేవారు. నకిలీ అడ్మిషన్‌ పత్రాలను సృష్టించి, సంజీవ్‌కు పంపించారు. తీరా అవి నకిలీ పత్రాలను తేలిపోవడంతో డబ్బు వెనక్కి ఇవ్వాలని రఘురాంను సంప్రదించగా తప్పించుకొని తిరిగే వాడు. దీంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీసులు ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు రఘురాం, సునీతలను అరెస్టు చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)