Breaking News

హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్‌ను అతిక్రమించిన చంద్రబాబు

Published on Wed, 11/01/2023 - 19:47

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చంద్రబాబు ఎన్నికల కోడ్‌ అతిక్రమించారు. వందలాది వాహనాల కాన్వాయ్‌తో ర్యాలీ నిర్వహించారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలి చేపట్టిన తెలుగుదేశం శ్రేణులు.. వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు వాహనాలను అడ్డం పెట్టడంతో బేగంపేట నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. అంబులెన్స్‌కు సైతం సైడ్ ఇవ్వకుండా వాహనాలు అడ్డుపెట్టి ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణుల ఓవర్‌ యాక్షన్‌పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, నిన్న తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తొలిరోజే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయలేదు. జైలు నుంచి బయటకు రాగానే మైకు అందుకున్నారు. కోర్టు.. ఆయన వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని గొప్ప విజయంగా, నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని చెప్పుకుంటూ చంద్రబాబును ఊరేగింపుగా తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)