Breaking News

ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్‌భవన్‌’

Published on Sun, 08/06/2023 - 02:52

సాక్షి, హైదరాబాద్‌/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్‌ సంతకం చేయాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్‌భవన్‌’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్‌ చౌరస్తా, రాజ్‌భవన్‌ తదితర మార్గాల్లో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్‌ నుంచి రాజ్‌భవన్‌ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. 

గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు 
రాజ్‌భవన్‌ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్‌ డౌన్‌ డౌన్‌’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్‌భవన్‌ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి థామస్‌ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లి గవర్నర్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. 

గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు 
ఆ తర్వాత «థామస్‌ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్‌ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్‌ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు.

తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్‌ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.ఆర్‌.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్‌టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్‌తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్‌భవన్‌లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్‌లో వదిలేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)