శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి
Breaking News
4న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ఛలో బస్సు భవన్
Published on Sun, 08/02/2026 - 22:30
హైదరాబాద్: దీర్ఘ కాలిక సమస్యల సాధన కోసం ఈ నెల 4వ తేదీన చలో బస్ భవన్ కు పిలుపునిస్తున్నట్టు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చి రెడ్డి వెల్లడించారు. ఇప్పటికీ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పీఆర్సీల ఎరియర్స్ రావాల్సి ఉందని తెలిపారు. రిటైర్డ్ బెనిఫిట్స్ బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య చికిత్సలు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు బస్ భవన్ వద్ద నిర్వహించే ఛలో బస్సు భవన్ కు పెద్ద ఎత్తున తరలి రావాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అదే విధంగా సూపర్ లగ్జరీ బస్ లోనూ రిటైర్డ్ ఉద్యోగులను అనుమతించాలని ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయంలో ఎండీకి విజ్జాపన పత్రం సమర్పిస్తున్నట్టు బుచ్చిరెడ్డి తెలిపారు.
Tags : 1