Breaking News

4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మ‌రో జాబ్‌!

Published on Thu, 08/28/2025 - 12:09

కాసిపేట: సర్కారు కొలువు సాధించడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించాడు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ ఏఈ (ఆపరేషన్‌)గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటులో రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం పాతబస్తీ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు చల్ల రమేశ్, రమాదేవి దంపతులు మంచిర్యాల వినూత్న కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు చల్ల ఆదర్శ్‌ 2018లో సింగరేణి (Singareni) సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఓవర్‌మెన్‌గా ఎంపికయ్యాడు.

ఉన్నతోద్యోగం సాధించాలనే లక్ష్యంతో అందులో చేరలేదు. ఆ తర్వాత రైల్వేశాఖలో జూనియర్‌ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. 2021లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీపీడబ్ల్యూడీ జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం (Junior Engineer Job) సాధించాడు. 2022లో రాష్ట్ర విద్యుత్‌ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి సిర్పూర్‌ ఏఈగా విధుల్లో చేరాడు. గ్రూప్స్‌ సాధించడమే లక్ష్యంగా సాగుతున్న క్రమంలో ఏఎండీ ప్రాసెసర్‌ ప్రైవేటు కంపెనీలో రూ.50 లక్షల ప్యాకేజీతో నియామకం అయ్యాడు. ఈ ఉద్యోగంలో చేరుతున్నానని, ఎప్పటికైనా గ్రూప్స్‌ సాధించడమే తన లక్ష్యమని ఆదర్శ్‌ తెలిపారు.

చ‌ద‌వండి: అమెరికా నుంచి వ‌చ్చి ఫ్రెండ్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన ఎన్నారై  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)