Breaking News

‘కేసీఆర్‌ సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్‌ బడ్జెట్‌ పెరిగింది’

Published on Sat, 04/08/2023 - 12:43

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. అనంతరం, పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌ బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో 13 వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తే అందులో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్‌ బడ్జెట్‌ పెరిగింది. రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్‌ రైలును ప్రారంభించాం. రూ, 7864 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాఆణలో జాతీయ రహదారులకు రూ. 1.04 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాలకు కేంద్రం జాతీయ రహదారులతో అనుసంధానం చేసిందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైల్వేను సమూలంగా మార్చారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.4400 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)