Breaking News

రూ.70 లక్షల లంచం డిమాండ్‌

Published on Sun, 05/11/2025 - 05:43

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం అర్బన్‌/వైరా: ట్యాక్స్‌ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ.70 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ (ఎక్సెంప్షన్స్‌) కమిషనర్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌ కుమారుడు జీవన్‌లాల్‌ లవిడియా సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమిషనర్‌ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం ఉచ్చు వేసి పట్టుకుంది. సీబీఐ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో మధ్యవర్తిని అరెస్ట్‌ చేసిన తర్వాత పలు ప్రాంతాల్లో మరికొందరిని అరెస్టు చేశారు. 

మధ్యవర్తి అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలో 18 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లంచం మొత్తంతో పాటు, రూ.69 లక్షల నగదు, పలు పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం పాండురంగాపురంలోని మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌ నివాసంలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు 50మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం తనిఖీ చేసినట్లు తెలిసింది. 

దీనికి సంబంధించి శుక్రవారం కమిషనర్‌ జీవన్‌లాల్‌ సహా 14 మందిపై కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు జీవన్‌లాల్‌ లవిడియాతోపాటు శ్రీరామ్‌ పలిశెట్టి (శ్రీకాకుళం), నట్టా వీర నాగ శ్రీరామ్‌ గోపాల్‌ (విశాఖపట్నం), ముంబైకి చెందిన విరల్‌ కాంతిలాల్‌ మెహతా, సాజిద మజ్హర్‌ హుస్సేన్‌ షాలను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)