Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఎక్కడంటే?

Published on Wed, 03/05/2025 - 09:26

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్‌ పోల్‌కు రెడ్‌ కార్నర్‌ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.

తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్‌ పోల్‌ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్‌ పోల్‌(Interpol )కు రెడ్‌ కార్నర్‌ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.

అనంతరం స్పందించిన ఇంటర్‌ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్‌ పోల్‌ నుంచి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఉన్నారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)