Breaking News

ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం

Published on Fri, 02/09/2024 - 17:41

సాక్షి, ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలు సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి , ప్రతివాదులను సర్వోన్నత న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది.

ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ఏసీబీ కోర్టు నుంచి పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌ లేదంటే ఛత్తీస్‌గఢ్‌కు  బదిలీ చేయాలంటూ పిటిషన్‌ దాఖలైంది. బీఆర్‌ఎస్‌ నేతలైన గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీ సత్యవతి రాథోథ్‌, మహమ్మద్‌ అలీలు ఈ పిటిషన్‌ వేశారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాల్ని పిటిషన్‌లో వ్యక్తం చేశారు. 

శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

నేటి తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. 2015లో టీడీపీలో ఉండగా ఈ కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే.. తన ‘మాజీ బాస్‌’, మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ తతంగం నడిచిందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు సైతం పిటిషన్‌లో ప్రస్తావించడం గమనార్హం.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)