Breaking News

TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

Published on Wed, 10/16/2024 - 10:59

హైదరాబాద్‌, సాక్షి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది.  ఇవాళ.. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులను గత నెల 24న కోర్టు ఆదేశించింది. గత నెల 24న విచారణకు మత్తయ్య హాజరుకాగా, మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. 

నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. మరోవైపు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని  మంగళవారం మత్తయ్య మీడియాతో అన్నారు.

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్‌ వేశారు. అందుకే ఈ పిటిషన్‌లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది.

ఓటుకు నోటు కేసు... విచారణ వాయిదా ఈ సారి కోర్టుకు రేవంత్

చదవండి: బాబు, రేవంత్‌ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)