Breaking News

వాట్సాప్‌ సందేశాలతో‘అట్రాసిటీ’ చెల్లదు

Published on Sun, 08/24/2025 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్, ఈ–మెయిల్‌ ద్వారా ప్రైవేట్‌గా పంపిన సందేశాలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. అవమానించే ఉద్దేశంతో అందరి ముందు కులం పేరుతో దూషించనప్పుడు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం కుదరదంటూ పిటిషనర్లపై కేసును కొట్టివేసింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌), సెక్షన్‌ 3(1)(ఎస్‌) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ఎదుట దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని చెప్పింది. 

క్రాంతికిరణ్‌ (ఎస్సీ), నిరుపమా దాడి (కాపు) క్లాస్‌మేట్స్‌. వేర్వేరు కులాలకు చెందినవారు. వీరు 2014లో వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో వారు విడిపోయారు. ఈ క్రమంలో నిరుపమ, ఆమె కుటుంబ సభ్యులు తనను కులం పేరుతో దూషించారని, తన దుస్తులను తగలబెట్టారని, తర్వాత విడాకులు కోరుతూ సందేశాలు, ఈ మెయిల్‌ ద్వారా బెదిరించారని క్రాంతి ఫిర్యాదు చేశారు. దీంతో నిరుపమ, ఆమె తండ్రి అనుపమ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈనేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజల మధ్య దూషణలు జరగలేదని, ఇది కేవలం వారి కుటుంబ వివాదం మాత్రమేనని వాదించారు. ఇంకా సాక్షులను విచారించాల్సి ఉన్నందున ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయొద్దని క్రాంతి తరఫు న్యాయవాది, ఏపీపీ కోరారు. 

వాదనలు విన్న న్యాయమూర్తి.. కుల దూషణ బహిరంగంగా జరిగినట్లు బయటి వ్యక్తులెవరూ వెల్లడించలేదని, ఇది వారి కుటుంబ వివాదం మాత్రమేనని స్పష్టంచేశారు. విచారణ కొనసాగించడం చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. పిటిషనర్లపై నమోదైన అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)