Breaking News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

Published on Tue, 02/18/2025 - 10:05

హైదరాబాద్, సాక్షి: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ కార్గో విమానానికి ల్యాండింగ్‌ సమస్య తలెత్తడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్‌ అప్రమత్తతో విమానం సేఫ్‌గా దిగగా..  అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాలకు అనుమతులు కాసేపు నిలిపివేశారు.

చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్(Landing Gear) సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల అనుమతి కోరాడు. వెంటనే అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌(Landing Take Off)ను నిలిపివేశారు. 

దీంతో.. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగారు. ఆ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో(Shamshabad Airport) కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.

విదేశీ కరెన్సీ పట్టివేత
హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని నిఘా వర్గాలు పట్టుకున్నాయి. నగరం నుంచి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద అనుమానాస్పద రీతిలో 22.75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ప్రకటించారు. అతనిని అదుపులోకి తీసుని విచారిస్తుట్లు తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)