Breaking News

కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్‌ దూసుకెళ్లి..

Published on Mon, 01/26/2026 - 13:24

రంగారెడ్డి జిల్లా: ఓ ఎస్‌ఐ విధుల్లో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాడు.. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది.. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్‌ఐ కిలోమీటర్‌ మేర వెళ్లిన తర్వాత కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధు సిబ్బందితో సాగర్‌ హైవేపై డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో మాల్‌ నుంచి కారులో ఇబ్రహీంపట్నం వైపు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. 

డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ మధును బలంగా ఢీకొట్టారు. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్‌ఐ అలా ఉండగానే మరింత వేగంగా దూసుకెళ్లారు. అదే క్రమంలో యాచారం బస్టాండ్‌ నుంచి బైకుపై మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్‌రెడ్డి, అతని కోడలు దివ్య, చిన్న బాలుడిని ఢీకొట్టి అలాగే దూసుకెళ్లారు. కారు బ్యానెట్‌పైనే ఉండి కిలోమీటర్‌ దూరం వెళ్లిన ఎస్‌ఐ కారుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు మాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. 

అతి వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీస్‌ సిబ్బంది 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కారులో (టీఎస్‌ 11ఏ–8519) ఉన్నది అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడ్, హయత్‌నగర్‌కు చెందిన శ్రీకర్, నితిన్‌లుగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన సమయంలో తీవ్రంగా గాయపడిన వారిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దివ్య భర్త లండన్‌లో ఉండగా రెండుమూడు రోజుల్లో ఆమె కూడా భర్త వద్దకు లండన్‌ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారును నడిపింది శ్రీకర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ప్రమాదంపై ఫ్యూచర్‌సిటీ సీపీ సు«దీర్‌బాబు సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధుతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.   

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)