Breaking News

Hyd: ఓఆర్‌ఆర్‌పై మంటల్లో చిక్కుకున్న కారు..

Published on Mon, 11/24/2025 - 07:42

మేడ్చల్‌:  మరో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై కారు అగ్నికి ఆహుతైంది. కారు ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. డ్రైవర్‌ తేరుకునేలోపే కారును మంటలు చుట్టుముట్టడంతో ఇక తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది.  

కీసర వెళ్తండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఏసీవేసుకుని పడుకున్న సమయంలో మంటలు వ్యాపించాయి.  ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.  ఇదిలా ఉంచితే, ఈ నెలలోనే సంగారెడ్డి ఓఆర్‌ఆర్‌పై ఒక కారు అగ్ని ప్రమాదం బారిన పడింది.  ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కానీ కారు అగ్నికి ఆహుతైంది. గత నెలలో పఠాన్‌చెరువు  సమీపంలో ముతంగి ఓఆర్‌ఆర్‌పై ఓ కారులో మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరూ కూడా ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు. 

ఓఆర్‌ఆర్‌పై ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే 14449 నెంబరుకు కాల్‌ చేయవచ్చు. ప్రమాదాలు కానీ, వాహనాల బ్రేక్‌డౌన్‌, పెట్రోలు, డీజిల్‌ ఖాళీ అయినా, పంక్చర్లు అయినా ఈ నెంబరుకు కాల్‌ చేస్తే సాయం అందుతుంది. ఇది కాకుండా పోలీసుల హెల్‌‍్పలైన్‌ 100, ఆంబులెన్స్‌ కోసం 108, అగ్ని ప్రమాదాల సందర్భంలో 101కు కాల్‌ చేసి సాయం అందుకోవచ్చు.

కార్లు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు..

  • ఓఆర్‌ఆర్‌పై  వేగంగా డ్రైవ్‌ చేయడం కూడా కార్లు తరుచు ప్రమాదంబారిన పడటానికి ప్రధాన కారణం.  కార్లను అత్యంత వేగంగా, ఓఆర్‌ఆర్‌పై నిర్దేశించిన వేగం కంటే కారును నడుపుతున్న సందర్భాల్లో ఇంజిన్‌ ఓవర్‌హీట్‌ అవుతూ ఉంటుంది. దాంతో కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • ఆయిల్‌ లీక్‌ అంశం కూడా కార్లు తొందరగా అగ్నికి ఆహుతి కావడానికి మరో కారణం. ఇక ఎలక్ట్రికల్‌ లోపాలతో కూడా కార్లు అగ్ని ప్రమాదం బారిన పడుతున్నాయి.
  • ఓఆర్‌ఆర్‌పై ఏదైనా కారు ప్రమాదానికి గురైనప్పుడు  అగ్ని మాపక వంటి సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యం అవుతుంది. ఓఆర్‌ఆర్‌ పై ప్రమాదం సమాచారం అందుకున్న తర్వాత స్పాట్‌కు ఎమర్జెన్సీ సర్వీసులు చేరుకోవడం అత్యంత కష్టంతో  కూడుకున్నదిగా మారింది. గ ఓఆర్‌ఆర్‌పై కార్లు అగ్ని ప్రమాదం బారినపడ్డప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులు సరైన సమయానికి రావడం అనేది ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

డ్రైవర్లు ఇలా చేస్తే..

  • రెగ్యులర్‌గా కార్లను చెక్‌ చేయడం అనేది డ్రైవర్లు పనిగా పెట్టుకోవాలి. వాహనం ఎలక్రికల్‌ వైరింగ్‌,ఆయిల్‌ ట్యాంక్‌, టైర్లు వంటి రెగ్యులర్‌ాగా జరిగేప్రాసెస్‌గా ఉండాలి
  • ఓఆర్‌ఆర్‌పై ాకార్లను పార్కింగ్‌ చేయడం అనేది మానేయాలి. ఓఆర్‌ఆర్‌ై వాహనాలను నిలిపి ఉంచడం అనేది నిషిద్ధమే కాదు.. ప్రమాదం కూడా .
  • కారు నుంచి పొగలు రావడం గమనిస్తే వెంటనే నిలిపివేయాలి.  వెంటనే కారు నుంచి దిగిపోవాలి.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)