Breaking News

డ్రైవర్‌కు మత్తెక్కింది.. కారు గోడెక్కింది!

Published on Sat, 07/26/2025 - 08:15

సాక్షి, దుండిగల్‌: ‘యమలీల’ సినిమా చూసిన ప్రేక్షకులకు బ్రహ్మానందం చేసిన హాస్యభరితమైన ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ‘ఆవు గోడపైకెక్కి పేడ ఎలా వేసిందంటావు’? అని పిడకలను చూసి కోట శ్రీనివాసరావును ప్రశ్నించడం కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. అలాంటి ఓ దృశ్యమే దుండిగల్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

నిద్ర మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తి సడన్‌గా బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి ఇలా ఓ ఇంటి గోడపైకెక్కి ఆగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ కారు బౌరంపేట నుంచి మల్లంపేట వైపు వేగంగా దూసుకువచ్చింది. ఈ క్రమంలో మహేశ్వరం వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి ప్రహరీని ఢీకొంది.

ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. ఉదయం నిద్రలేచి చూసిన ఆ ఇంటి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. విషయాన్ని పోలీసులకు తెలపగా.. సదరు వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపించాడా..? నిద్ర మత్తులో ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గోడపై పార్కింగ్‌ చేసినట్లు ఉన్న కారు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ‘అలా ఎలా పార్క్‌ చేశావు బ్రో’ అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌ చేశారు. 


 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)