Breaking News

పరీక్షల పంచాయితీ

Published on Thu, 03/16/2023 - 01:22

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. పలు పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకై ఉంటాయనే అనుమానాల నేపథ్యంలో.. కమిషన్‌ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేయాలని అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఏకంగా కమిషన్‌ చైర్మన్‌ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

ఇప్పటివరకు ఏడు పరీక్షలు 
రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చి న తర్వాత టీఎస్‌పీఎస్సీ వివిధ ప్రభుత్వ శాఖల్లో 17 వేల ఉద్యోగాల భర్తీకి 26 ప్రకటనలు జారీ చేసింది. ఇందులో ఇప్పటివరకు ఏడు పరీక్షలు నిర్వహించింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ప్రకటనలు వెలువడుతుండగా, వాటికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరీక్షా కేంద్రాల ఎంపిక, వాటి నిర్వహణ తదితరాలపై దృష్టి పెట్టిన టీఎస్‌పీఎస్సీ... వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతేడాది అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది.

ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెన్టివ్‌ మెడిసిన్‌ విభాగంలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌ఓ) ఉద్యోగాల అర్హత పరీక్షలను గతేడాది నవంబర్‌ 7వ తేదీన నిర్వహించింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీడీపీఓ), అసిస్టెంట్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(ఏసీడీపీఓ), వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో మేనేజర్‌ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షను ఈ ఏడాది జనవరి మూడో తేదీన నిర్వహించగా.. ఇదే శాఖలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌) ఉద్యోగాల అర్హత పరీక్ష ఈ ఏడాది జనవరి 8వ తేదీన నిర్వహించారు.

అలాగే ఇంజనీరింగ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష జనవరి 22న, ఆర్థిక శాఖకు సంబంధించిన డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) అర్హత పరీక్ష ఫిబ్రవరి 26న, వివిధ ఇంజనీరింగ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్, టెక్నికల్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష మార్చి 5వ తేదీన నిర్వహించారు. ఇక ఈనెల 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష రద్దు కాగా, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలు కూడా రద్దయ్యాయి. 

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ లీక్‌పై అనుమానాలు 
నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనల్లో తొలుత నిర్వహించిన అర్హత పరీక్ష గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌. కాగా ఈ పరీక్షకు లీక్‌ కేసులో నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ కూడా హాజరై ఏకంగా 103 మార్కులు తెచ్చుకోవడంతో పేపర్‌ లీక్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పైగా ప్రవీణ్‌ టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కంప్యూటర్‌ నుంచి ఓ ఫోల్డర్‌ మొత్తం కాపీ చేశాడని, అందులో వివిధ పరీక్షల పేపర్లు ఉన్నాయనే సమాచారం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు నిర్వహించిన ఏడు పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు.. టీఎస్‌పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, దీక్షలు చేపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా చేయాలని, కమిషన్‌ కార్యదర్శిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)