Breaking News

కేశవాపురం రిజర్వాయర్‌ కాంట్రాక్టు రద్దు

Published on Thu, 11/07/2024 - 04:29

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు గాను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్‌ పనుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. గోదావరి ఫేజ్‌– 2లో భాగంగా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్‌ నుంచి శామీర్‌పేట్‌ సమీపంలో నిర్మించే కేశవాపురం రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించేలా గత ప్రభుత్వం డీపీఆర్‌ తయారు చేసింది. 

ఆరేళ్ల క్రితమే మేఘా కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది. అయితే పనులు ప్రారంభించకపోవడంతో ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ తాజాగా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేశవాపురం ప్రాజె క్టుకు అయ్యే రూ. 2 వేల కోట్లతోనే గోదావరి ఫేజ్‌–2 పథకాన్ని మల్లన్నసాగర్‌ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 

తాగునీటికి 10, జంట జలాశయాలకు 5 టీఎంసీలు 
మల్లన్నసాగర్‌ నుంచి తరలించే 15 టీఎంసీల జలాల్లో 10 టీఎంసీలు హైదరాబాద్‌ ప్రజల తాగు నీటికి, 5 టీఎంసీలు జంట జలాశయాలకు అందించనున్నారు. మల్లన్నసాగర్‌ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్‌ వాటర్‌ బోర్డ్‌ అధికారులను సీఎం ఆదేశించారు.  

గత ప్రభుత్వ ప్రతిపాదన ఇలా..  
గత ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం.. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు తరలించి అక్కడినుంచి ఎత్తిపోతల ద్వారా 5 టీఎంసీల కేశవాపురం చెరువును నింపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఘన్‌పూర్‌ మీదుగా హైదరాబాద్‌కు తాగునీటి కోసం 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. అయితే ఆరేళ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూ సేకరణ చిక్కులతో పాటు అలైన్‌మెంట్‌ లోపాలతో పనులు ముందుకు సాగలేదని ప్రభుత్వం గుర్తించింది. 

పనులు ప్రారంభించని నిర్మాణ సంస్థ 
బీఆర్‌ఎస్‌ హయాంలో రిజర్వాయర్‌ నిర్మాణ టెండర్లను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ వివిధ కారణాలతో పనులు ప్రారంభించలేదు. అ యితే 2017 నాటి ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం పను లు చేపట్టలేమని, 2024 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని కోరుతూ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా ఆ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కొత్త డిజైన్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కూడా.. 
కాంగ్రెస్‌ సర్కార్‌ మార్చిన డిజైన్‌లోని కొత్త రూట్‌ ప్రకారం.. మల్లన్నసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌కు అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేస్తారు. దీనితో పాటు మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌లకు 5 టీఎంసీలు సరఫరా చేస్తారు. ఎక్కువ శాతం నీరు గ్రావిటీతో వచ్చేలా పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  

మల్లన్నసాగర్‌ బెస్ట్‌ ఆప్షన్‌!
కొండపోచమ్మ సాగర్‌కు 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే ఉండగా.. మల్లన్నసాగర్‌కు 50 టీఎంసీల కెపాసిటీ ఉంది. కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల నీళ్లుంటే తప్ప నీటిని పంపింగ్‌ చేయడం వీలుకాదు. అదే మల్లన్నసాగర్‌లో డెడ్‌ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్‌ చేసుకునే వీ లుంది. అందుకే కొండపోచమ్మ సాగర్‌కు బదులు మల్లన్నసాగర్‌ను ఎంచుకున్నట్లు అధికార వర్గా లు తెలిపాయి.

పాత ప్రతిపాదనలో అక్కారం, మర్కూర్, కొండపోచమ్మ సాగర్, బొమ్మరాసిపేట, ఘన్‌పూర్‌.. మొత్తం 5 చోట్ల నీటిని పంపింగ్‌ చేయాలి. కానీ కొత్త డిజైన్‌లో మల్లన్నసాగర్, ఘన్‌పూర్‌ల వద్ద నీటిని పంపింగ్‌ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఒక కిలో లీటర్‌కు రూ.48 వరకు ఖర్చు అవుతుండగా, కొత్త ప్రాజెక్టు పూర్తయితే కేవలం రూ.4 ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది.
 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)