Breaking News

Hyderabad: అపార్ట్‌మెంట్‌లోకి దూసుకొచ్చిన తూటా

Published on Sun, 07/14/2024 - 07:23

మణికొండ: బైరాగిగూడలో ఓ అపార్ట్‌మెంట్‌ బెడ్రూం కిటికీ అద్దాల్లోంచి దూసుకువచ్చి గోడకు తగిలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బైరాగిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌ అయిదో అంతస్తులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సిద్ధార్థ్‌ ఉంటున్నారు. 

శనివారం ఆయన ఉదయం తన భార్యతో కలిసి కిందకు వెళ్లి వాకింగ్‌ చేస్తున్నారు. ఇంతలోనే ఓ తూటా వీరి ఇంట్లోని బెడ్రూం కిటికీ అద్దాలను చీల్చుకుంటూ వచ్చి గోడకు తగిలింది. ఆ శబ్దానికి ఇంట్లోని పెంపుడు కుక్క పెద్దగా అరవటంతో వాకింగ్‌ చేస్తున్న సిద్ధార్థ్‌ ఇంట్లోకి వచ్చారు. కిటికీకి రంధ్రం ఉండటం, బెడ్రూంలో తుపాకీ తూటా కింద పడి ఉండటాన్ని గమనించి ఎవరో తన ఇంటిపై కాల్పులు జరిపారని భయాందోళనకు గురయ్యారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు.

 పక్కనే ఉన్న తెలంగాణ పోలీస్‌ అకాడమీ నుంచి వచ్చి ఉంటుందని, వారు శుక్రవారం నుంచి ఫైరింగ్‌ శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పక్కనే ఉన్న ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి బుల్లెట్‌ వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింగ్‌ రేంజ్‌లకు సమీపంలో అపార్ట్‌మెంట్‌లకు అనుమతులు ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్రహీంబాగ్‌ రెజిమెంట్‌ నుంచి మణికొండ క్వార్టర్స్‌లోకి బుల్లెట్‌లు వచ్చి పడ్డాయని స్థానికులు గుర్తు చేశారు.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)