Breaking News

‘కేన్స్‌’పై నిజాలు చెప్పండి: కేటీఆర్‌

Published on Thu, 09/05/2024 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: ఎల్రక్టానిక్స్‌ దిగ్గజ సంస్థ కేన్స్‌ గుజరాత్‌కు తరలిపోతున్నా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు చెప్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయని, కాంగ్రెస్‌ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో అయోమయం నెలకొందన్నారు. 

ఇకనైనా కేన్స్‌ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలని ‘ఎక్స్‌’వేదికగా కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేన్స్‌ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లను స్థాపించేలా ఒప్పించి అన్ని అనుమతులను ఇచ్చామన్నారు. వీటిలో సాధారణ ఎల్రక్టానిక్స్‌ తయారీ యూనిట్‌తో పాటు మరో అత్యాధునిక యూనిట్‌ (ఒసాట్‌)ను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 

మరో పీసీబీ యూనిట్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు కంపెనీని ఒప్పించామని కేటీఆర్‌ తెలిపారు. ఒసాట్‌ను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసి ఉంటే సెమీ కండక్టర్ల రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్‌ ఉండేదన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించి, అవసరమైతే ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతూ కాంగ్రెస్‌ పార్టీ సర్కస్‌ ఫీట్లు చేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారిపై చర్యలు అంటూ హంగామా చేస్తోందన్నారు.    

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)