Breaking News

Telangana: డిపాజిట్టూ గోవిందా!

Published on Thu, 06/06/2024 - 13:24

సాక్షి, హైదరాబాద్‌: మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోకొచ్చే 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 16 స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో అంతటి విజయాన్ని నమోదు చేయలేకపోవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. రాజధాని నగరంతో కలగలసి ఉన్న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గెలుపు సంగతి అటుంచి కనీసం రెండోస్థానంలో కూడా లేకుండా పోయారు. అంతే కాదు.. డిపాజిట్‌ తిరిగి పొందడానికి అవసరమైన కనీస ఓట్లను కూడా పొందలేకపోయారు. దీంతో కారు పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.  

ప్రజలు తమ వెంటే ఉన్నారనుకుని.. 
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా గ్రేటర్‌ నగరంలో తమ పట్టు చెక్కు చెదరలేదని పార్టీ నేతలు  భావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించనందుకు ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎక్కువ లోక్‌సభ సీట్లు సాధించడం ద్వారా ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. నగరంలో తాము చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు గెలిపిస్తారని, ఎక్కువమంది ఎంపీల బలంతో ఢిల్లీలోనూ సత్తా చూపుదామని ఉత్తేజపరిచారు. పార్టీ అభ్యర్థుల ప్రచార సభలకు, కేటీఆర్‌  రోడ్‌షోలకు హాజరైన ప్రజలను చూసి గెలుపు తమదేనని భావించారు.  

ఫలితాలను చూసి.. కంగు తిని.. 
గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల బలంతో ఎంపీ సీట్లు కూడా తమకే వస్తాయనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే అసెంబ్లీ నాటి విజయం సంగతి అటుంచి పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం పోలైన ఓట్లలో 1/6 (16.66 శాతం) ఓట్లు లభిస్తే అభ్యర్థులు డిపాజిట్‌గా ఉంచిన నగదు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అభ్యర్థులు ఆషామాషాగా పోటీ చేయకుండా ఉండేందుకు డిపాజిట్‌ జమ చేసుకోవడం తెలిసిందే. డిపాజిట్‌ పొందడానికి అవసరమైనన్ని ఓట్లు రాకపోవడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.   

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)