Breaking News

నేడు బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌

Published on Sat, 11/29/2025 - 01:55

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ చేపట్టిన నిరాహార దీక్ష ఘట్టాన్ని గుర్తు చేస్తూ ‘దీక్షా దివస్‌’కోసం ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.

కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. కాగా, దీక్షా దివస్‌ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉద్యమ ఘట్టాలను గుర్తు చేస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్, కేసీఆర్‌ పాత్రను గుర్తు చేసేలా రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్‌ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

జిల్లా కేంద్రాల్లోనూ కార్యక్రమాలు
దీక్షా దివస్‌ ఏర్పాట్లకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమా వేశాలు నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లా కేంద్రాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లో కేటీఆర్‌ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనలో కేసీఆర్‌ కృషిని కొత్త తరానికి చాటి చెప్పేందుకు యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లోనూ ‘దీక్షా దివస్‌’ను నిర్వహించనున్నారు. 

కేసీఆర్‌ కటౌట్లకు పాలాభిషేకాలు: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఫొటోలను తెలంగాణ భవన్‌ నుంచి పంపించారు. కార్యక్రమం ప్రారంభంలో కార్యకర్తలు పార్టీ అధినేత కేసీఆర్‌ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తారు. తెలంగాణ భవన్‌లో జరిగే ‘దీక్షా దివస్‌’ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం పరిశీలించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)