బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా మళ్లీ వాయిదా

Published on Sat, 01/11/2025 - 13:55

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. నల్గొండలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే  సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజ‌య‌వాడ-హైద‌రాబాద్ హైవేపై ట్రాఫిక్ ర‌ద్దీతో పాటు త‌దిత‌ర కార‌ణాల‌తో పండుగ త‌ర్వాత మ‌హాధ‌ర్నా నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy) నేతృత్వంలో మహాధర్నా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ ముందుకు జరుపుతూ వస్తోంది.  తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతీ తెలిసిందే. 

రైతు భరోసా(Rythu Bharosa) కుదింపుపై రైతుల ఆగ్రహాన్ని ప్రజలను చూపించాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ ఈ కార‍్యక్రమం నిర్వహించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించింది. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్‌తో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఈ మహాధర్నా నిర్వహించాలని భావిస్తోంది.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)