Breaking News

అల్లు అర్జున్‌ రిలీజ్‌ ఆలస్యమెందుకు?.. అదే జరిగితే స్టేట్‌ అగ్నిగుండమే: కౌశిక్‌ రెడ్డి

Published on Sat, 12/14/2024 - 12:53

సాక్షి, కరీంనగర్‌: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎవరినైనా అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్‌ పేపర్స్‌ అందిన తర్వాత కూడా ఎందుకు రిలీజ్‌ చేయలేదని ప్రశ్నించారు.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ అరెస్ట్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లు అర్జున్ పాన్‌ ఇండియా స్టార్. అల్లు అర్జున్‌ అయినా, నేనైనా, ఎవరైనా సరే.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నాడు. బెయిల్‌ పేపర్స్‌ నిన్ననే జైలు సూపరింటెండెంట్‌కు అందిన తర్వాత రిలీజ్‌ ఎందుకు చేయలేదో చెప్పాలి.

సోషల్‌ మీడియాలో కేటీఆర్ అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలు వింటున్నా. అదే జరిగితే తెలంగాణా అగ్నిగుండం అవుతుంది. ఫార్ములా ఈ-రేసు కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఓ విజన్ లేక, ఏం చేయాలో తెలియక, దాన్ని తీసుకొచ్చిన కేటీఆర్ ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. ఫార్మూలా ఈ-రేసు తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్‌కు టెస్లా తీసుకొద్దామన్న ఆలోచన కేటీఆర్‌కు ఉండేది. ఈ విషయం వీళ్లకు తెలుసా అని ప్రశ్నించారు.

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)