Breaking News

ప్రియాంకా.. స్కూటీలు ఎక్కడ?

Published on Wed, 03/19/2025 - 05:22

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. స్కూటీల ఆకారంలో ఉన్న ప్లకార్డులతో సభ ఆవరణకు చేరుకున్నారు. కాంగ్రెస్‌  నాయకురాలు ప్రియాంకాగాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీ నెరవేర్చలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు.

‘ప్రియాంకగాందీ.. స్కూటీలు ఎక్కడ?’అంటూ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ తదితరులు నినాదాలు చేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్‌ వద్ద కవిత మాట్లాడుతూ కల్యాణమస్తులో భాగంగా తులం బంగారం ఇవ్వలేమన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పనిచేస్తోందన్నారు.  

సమస్యలకు కేంద్రంగా తెలంగాణ.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణను మళ్లీ సమస్యలకు కేంద్రంగా మార్చుతోందని శాసనమండలి బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ సభలో తామిచ్చిన హామీలు అమలు చేయలేమని స్వయంగా వారే ఒప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)