Breaking News

రాహుల్‌ను సీఎం సొంతూరుకు తీసుకెళ్తా

Published on Fri, 08/30/2024 - 02:51

సాక్షి, హైదరాబాద్‌: ‘రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి గజదొంగలా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నాడు. రుణమాఫీ జరగలేదని ఓవైపు మంత్రులు చెబుతుంటే రేవంత్‌ మాత్రం ఢిల్లీలో రాహుల్‌ గాం«దీని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకే వరంగల్‌ సభకు రావాలని రేవంత్‌ మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్‌ రావట్లేదు.

హైదరాబాద్‌కు రాహుల్‌ వస్తే విమానాశ్రయంలోనే స్వాగతం పలికి సీఎం సొంతూరుకు తీసుకెళ్లి రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని ఆయనకు చూపిస్తాం’అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో హరీశ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం రేవంత్‌ చిట్‌చాట్‌ పేరిట ‘చీట్‌చాట్‌’(మోసగించే ముచ్చట్లు) చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

వాల్మికి స్కామ్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు 
కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణకు చెందిన తొమ్మిది కంపెనీల ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయని.. ఈ స్కామ్‌పై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే ఈడీ విచారణ జరగట్లేదని హరీశ్‌రావు ఆరోపించారు. దీనిపై విచారణ కోసం త్వరలో ఈడీని కలుస్తామని చెప్పారు. 

హైడ్రా ఆఫీసును రంగనాథ్‌ కూల్చివేయాలి 
‘హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని కూల్చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని... దేవుళ్లపై ఒట్లతో ప్రజల విశ్వాసాన్ని కూల్చేసింది. బుద్ధ భవన్‌ నాలా కింద ఉన్న హైడ్రా ఆఫీసును కమిషనర్‌ రంగనాథ్‌ కూలగొట్టి ఇతర భవనాల వైపు చూడాలి. జీహెచ్‌ఎంసీ ఆఫీసు, నెక్లెస్‌ రోడ్డు రెస్టారెంట్లు, మీరాలం, ఉప్పల్, రామాంతపూర్‌ చెరువుల్లోని నిర్మాణాలు కూడా కూలుస్తారో లేదో చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

ఫోర్త్‌ సిటీ పేరిట భూములు కొల్లగొట్టే కుట్ర 
ఫోర్త్‌ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సర్వే నంబర్‌ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని... తుక్కుగూడలో సర్వే నంబర్‌ 895లో 25 ఎకరాలను పేద రైతుల నుంచి బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చెలామణి అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరిట భూములు కొంటున్నారని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేస్తే మంత్రులెవరూ రాలేదని హరీశ్‌ ఎద్దేవా చేశారు. 

కవిత బెయిల్‌ వ్యాఖ్యలపై ‘సుప్రీం’మొట్టికాయలు 
‘సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ధి ఉన్నవారికి అన్నీ వంకరగానే కనిపిస్తాయి. బీజేపీ ఇస్తేనే ఓటుకు రూ. కోట్లు కేసులో రేవంత్‌కు బెయిల్‌ వచ్చిందా? ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ విషయంలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. 

కవితకు బెయిల్‌ విషయంలో న్యాయం, ధర్మం గెలిచింది. ఈడీ, సీబీఐ తీరుపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ వస్తే అది బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్‌ వస్తే బీజేపీతో లాలూచీ అనడం రేవంత్‌ అపరిపక్వతకు నిదర్శనం’అని హరీశ్‌ విమర్శించారు. 

విద్యార్థులను ఎలుకలుకరవడం దారుణం 
మెదక్‌ జిల్లా రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులపై, నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేయడం దారుణమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో 500 మందికిపైగా గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల పాలవగా 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)