నేడు మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ మహా ధర్నా

Published on Mon, 11/25/2024 - 06:04

మహబూబాబాద్‌: లగచ ర్ల బాధితులకు అండగా సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ దళిత, గిరిజన రైతులతో కలసి మహా ధర్నా నిర్వహించనుంది. మహబూబాబాద్‌ తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్ర మం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పా ర్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చేవరకూ వదిలి పెట్టమని ఎర్రబెల్లి అన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వందకుపైగా సీట్లతో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ముందే అరెస్ట్‌ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంప పెట్టులాంటిందన్నారు. అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)