Breaking News

జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

Published on Sat, 06/28/2025 - 11:21

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తికర వాతావరణల నెలకొంది. హైదరాబాద్‌లో అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పు పై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.

జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి రెండు వైపులా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆఫీసులోకి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అనుమతి నిరాకరించడంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం, ఆఫీసు గేట్లకు తాళం వేసి కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జీహెచ్‌ఎంసీ ఎదుట బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కార్పొరేటర్లు బైఠాయించి అన్నపూర్ణ క్యాంటీన్ ముద్దు.. ఇందిరమ్మ క్యాంటీన్ వద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శించి నినాదాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..‘హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారు. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పేరు మార్చాలని ఉదేశ్యం ఉంటే GHMC కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్దతి కాదు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తు వస్తారు..

అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం ఉంటే  కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టీ, ఓటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీజేఆర్‌ ఫ్లై ఓవర్ ఓపెన్ చేస్తున్నారు.. మరి అది కట్టింది ఎవరు?. తిమ్మిని బమ్మిని చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’ అని హెచ్చరించారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)