Breaking News

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Published on Tue, 08/05/2025 - 06:15

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరం చేయి చేయి కలిపి పనిచేద్దామని కోరారు. సోమవారం గాందీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ల సమక్షంలో ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కొండబాలకు పార్టీ కండువా కప్పిన పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇచ్చారని, వారి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అన్ని విషయాలపై అవగాహన కలిగిన కొండబాల లాంటి నేతలు పార్టీలోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.

మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కొండబాల తన సొంత ఇంటికి తిరిగి వచ్చారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావుతో పాటు ఖమ్మం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)