నేడు బీఆర్‌ఎస్‌ ‘యువ సంగ్రామ సదస్సు’

Published on Sat, 07/18/2026 - 04:09

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పూరించిన బీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా ‘యువ సంగ్రామ సదస్సు’ను నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు హాజరయ్యేలా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు సంబంధించి సుమారు పది రోజుల క్రితం నుంచే బీఆర్‌ఎస్‌ సన్నాహాలు ప్రారంభించింది.

అయితే చివరి నిమిషం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో శుక్రవారం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సదస్సు నిర్వహణకు సంబంధించి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, స్పోర్ట్స్‌ అథారిటీకి తాము దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం అనుమతులిచి్చంది. పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి తదితరులు సరూర్‌ నగర్‌ స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

ఆరు డిక్లరేషన్లపై సమరభేరి
2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ 2022 మే మొదలుకుని 2023 నవంబరు వరకు ఆరు డిక్లరేషన్లు విడుదల చేసింది. వరంగల్‌లో 2022 మే 6న జరిగిన ‘రైతు డిక్లరేషన్‌’ సభకు రాహుల్‌ గాం«దీ, హైదరాబాద్‌లో 2023 మే 9న జరిగిన ‘యూత్‌ డిక్లరేషన్‌’సభకు ప్రియాంక గాందీ, చేవెళ్లలో 2023 ఆగస్టు 26న జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , 2023 నవంబర్‌ 9న హైదరాబాద్‌లో జరిగిన ‘మైనారిటీ డిక్లరేషన్‌’ సభకు మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్, నవంబర్‌ 10న కామారెడ్డిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్‌’ సభకు అప్పటి కర్ణాటక సీఎం సిద్దరామయ్యలు హాజరయ్యారు. ఈ సభల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ల వారీగా సమరభేరీ మోగించాలని, ఆయా తేదీల్లో సభలు జరిగిన చోటే పోటీ సభలు లేదా సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌
సరూర్‌నగర్‌ స్టేడియంలో నేడు బీఆర్‌ఎస్‌ నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. శనివారం ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు సదస్సును నిర్వహించాలని షరతు విధించింది. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల సమస్యలు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది. 

యువ సంగ్రామ సదస్సుకు అనుమతివ్వాలని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్, ఎల్‌బీ నగర్‌ డీసీపీ, ఏసీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేరుస్తూ లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టీ.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.వాదనలు విన్న న్యాయమూర్తి సదస్సుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)