Breaking News

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్ట్‌?

Published on Thu, 04/10/2025 - 12:13

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  వివిధ కేసుల్లో ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌లు జారీ అయ్యాయి. ముఖ్యంగా ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి. 

అయితే అరెస్ట్‌ భయంతో గత కొన్ని నెలలుగా ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో తన తల్లి అంత్యక్రియల కోసం వచ్చిన ఆయన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల కోసం ఆయన్ని బోధన్‌కు తీసుకెళ్లి ఆపై స్టేషన్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

షకీల్‌ అమీర్‌ మహమ్మద్‌ గతంలో బీఆర్‌ఎస్‌ తరపున రెండుసార్లు బోధన్‌ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు.

సాహిల్‌ను తప్పించి.. 
2023 డిసెంబర్‌ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్‌ ఆసిఫ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది. 

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్‌ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో  ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్‌ కోసం పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్‌ వేటు పడింది కూడా. 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)