Breaking News

జీహెచ్‌ఎంసీలో కార్పొరేషన్ల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం

Published on Sat, 11/29/2025 - 01:43

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఓ ప్రాంతాన్ని మజ్లిస్‌కు అప్పగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో పురపాలికలు, కార్పొరేషన్ల విలీనాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. ‘ఏడాది క్రితం కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తామంటున్నారు. 

రోడ్లు లేవు, తాగునీరు అందడంలేదు. ప్రభుత్వం తొలుత మౌలిక సదుపా యాలను కల్పించడంపై దృష్టిసారించాలి’అని కోరారు. 20 గ్రామాలను జీహెచ్‌ఎంసీలో కలిపేస్తే ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు బంధు నిలిచిపోతుందని, వందలాది మంది రైతులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని పేదలు పంచాయతీకి పన్నుకట్టడానికే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు గ్రేటర్‌లో కలిపేస్తే పన్ను పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సగం జనాభా.. అంటే సుమారు 2 కోట్ల మందిని జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకువస్తున్నారని, ఇది అశాస్త్రీయంగా ఉందని ఆయన అన్నారు.

‘పంచాయతీలను విలీనం చేయాలనుకుంటే ముందుగా ప్రజాభిప్రాయం సేకరించాలి. కౌన్సిల్‌ సభ్యులతో చర్చించాలి. అలాంటి ప్రక్రియ ఏదీ జరగకుండా నేరుగా ఆదేశాలివ్వడంలోనే ప్రభుత్వానికి దురుద్దేశముందని స్పష్టమవుతోంది’అని అన్నారు. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు గ్రేటర్‌లో ఉంటే పరిపాలన ఇబ్బందులకు దారితీస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పురపాలికల విలీన ప్రక్రియపై మరో మారు ఆలోచించాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)