Breaking News

బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చలు.. టికెట్ల కసరత్తు షురూ!..

Published on Mon, 10/02/2023 - 07:54

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ.. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తను వేగవంతం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సహం ఉన్న వారి నుంచి పార్టీ నాయకత్వం దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 6,003 అప్లికేషన్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 40 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి ఉన్న ముఖ్య నేతల స్థానాలకు గానూ మొదటి జాబితాను అగ్ర నాయకత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.మిగతా చోట్ల అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, విజయావకాశాలు, ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశాలున్న బలమైన నేతల పేర్లు తదితర అంశాలపై పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.

ఆదివారం దిల్‌ కుశ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొ­న్నట్టు సమాచారం. చాలాచోట్ల నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను సూచిస్తూ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన జాబితాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  

సంఘ్‌ పరివార్‌ నుంచి కూడా జాబితా? 
ఇక సంఘ్‌ పరివార్‌ నుంచి కూడా అభ్యర్థుల ప్రతిపాదనలతో మరో జాబితా తీసుకున్నట్టు సమాచారం. ఈ జాబితాలను సరి చూసి కామన్‌గా వచ్చిన పేర్లతో ముసాయిదా జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వ పరిశీలనకు పంపించ నున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండుమూడు రోజుల్లో ఈ ముఖ్యనేతలు మరోసారి సమావేశమై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సమాలోచనలు జరపనున్నట్టు తెలిసింది. కాగా, ఈ నెల 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం పొద్దుపోయే వరకు ఈ భేటీ సాగినట్టు సమాచారం.   

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)