Breaking News

విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం

Published on Sat, 08/12/2023 - 02:17

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్‌ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది.

ఆయా భేటీల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్‌ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన  ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్‌ జవదేకర్,  నేతలు అరవింద్‌ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్‌ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్‌ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్‌ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు.  

పార్టీ నేతలతో జవదేకర్‌ భేటీ
తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్‌ జవదేకర్‌ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి  బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)