Breaking News

‘నక్సల్స్ ముక్త్ భారత్ మా ధ్యేయం’

Published on Sat, 08/16/2025 - 21:30

కరీంనగర్‌:  నక్సల్స్‌(మావోయిస్టులు) ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ వంటి ఆపరేషన్లను ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. ఈరోజు(శనివారం, ఆగస్టు 16వ తేదీ) కరీనంగర్‌లో  నక్సల్స్‌ నరమేధం-మేథోమథనం చర్చలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. 

దీనిలో భాగంగా  నక్సల్స్‌ చేతిలో బలైన ఏబీవీపీ విద్యార్థులకు నివాళులర్పించారు బండి సంజయ్‌. అనంతరం మాట్లాడుతూ.. నక్సల్స్‌ ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ను ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు. నక్సల్స్‌తో చర్చలు జరిపిన వారు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. 

‘తూపాకీ పట్టి అమాయకులను చంపుతుంటే చూస్తూ ఊర్కోవాలా?, నక్సల్స్ తూటాలకు 50  వేల మంది బలి అయ్యారు. 50 ఏళ్లలో భారీ విధ్వంసం జరిగింది. ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేశారు. నక్సల్స్‌కు  మద్దతిస్తున్న వారికి విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?, ఎంతో మందిని నక్సల్స్ చంపినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా?, జాతీయ జెండాను ఎగరనీయని నక్సలైట్లు ఏ దేశ భక్తులు?, బాక్సైట్ తవ్వకాల కోసమే ‘ఆపరేషన్ కగార్’ నిర్వహిస్తున్నారని ప్రచారం చేయడం దుర్మార్గం. 

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు గనుల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి కదా?, బ్యాలెట్, బుల్లెట్ ఒకే ఒరలో ఉండలేవు. నక్సలైట్ల ఏరివేతను కొనసాగిస్తాం. 2026 మార్చినాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం. నక్సల్స్ ముక్త్ భారత్ మా ధ్యేయం’ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)