Breaking News

అనుమతి పొందిన కట్టడాలను ఎలా కూలుస్తారు?: బీజేపీ ఎమ్మెల్యే

Published on Tue, 08/20/2024 - 15:30

సాక్షి, హైదరాబాద్‌: హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో మాత్రం సరైన తీరు లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘సామాన్య ప్రజలకు శికం భూమా, బఫర్ జోన్‌లో ఉందా? అనేది తెలీదు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టి భూమి కొంటారు. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది’’ అని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.

‘‘చెరువులను కాపాడాలి. అక్రమ కట్టడాలను కుల్చాలి కానీ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు?. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చితే మంచిదే.. కానీ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతి పొందిన వాటిని ఎలా కూలుస్తారు? రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సామాన్య ప్రజలది తప్పు అన్నట్లు చేస్తున్నారు. రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉండటం తెలంగాణకు మంచిదే కానీ ఇలా ఎంతకాలం చేస్తారు?. నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూలగొట్టడం మంచిది కాదు’’ అని వెంకటరమణారెడ్డి చెప్పారు.

‘‘గత ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలను బలి పశువు చేస్తారా..?. రేవంత్ రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన వారికి బేడీలు వేసి జైల్లో వేయాలి అప్పుడే మిగతావారికి భయం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పక్కకి పోయాయి ఇప్పుడు హైడ్రా కొన్నాళ్లు హడావుడి’’ అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)